రే రే లెగరా రగిలే సెగలా
రే రే పదరా నిషలే చెదరా
రాలు షోకాలు భయ బీత హృదయాలు
పీకరా ఇక చిచ్చర పిడుగై
శాంతికి క్రాంతికి వేసిన అడుగై
రే రే లెగరా రగిలే సెగలా
వీధి వీధినా వికృత సమరాలు
వాడ వాడలా వికత దేహాలు
రౌడీ యుజమే ఒక క్రీడ రా
ప్రతి ఊరు ఓ బెజవాడ రా
ఊరుకుంటే వదలదు ఈ పీడ
రే రే లెగరా రగిలే సెగలా
నీడ చూసి నువు వనికి పోతుంటే
తాడు పాములా బుసలు కొడుతుంది
సమరానికి సయ్యని సాగితే
బరి లోనికి కసిగా దూకితే
చావు కూడా శరణమంటుంది
రే రే లెగరా రగిలే సెగలా
రే రే పదరా నిషలే చెదరా