నేనా పాడనా పాటా
మీరా అన్నదీ మాటా ||2||
నీ వదనం భూపాలమూ నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ నువ్వు పాడిందే సంగీతమూ
ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం (2)
ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ నీకు ఎందుకు సందేహమూ
నీకు ఎందుకు సందేహము
ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా (2)
కుత కుత వరి అన్నం తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ నీకా పదునెటు తెలిసిందీ
నీకా పదునెటు తెలిసింది