Bapps

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం
ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం చతుర్వేదవినుతం
లోకవిదితం ఆదికవి వాల్మికి రచితం సీతరామచరితం
కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా
కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా
అండదండగ తమ్ముడుండగ కడలితల్లికి కనుల పండగ

సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్పనఖ
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగ
తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి
అన్న చూడని అక్కసు కక్కుచు రవణు చేరెను రక్కసి

దారునముగ మాయ చేసె రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడు
అదను చూసి సీతని అపహరించె రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి
కరకు గుండెలోపాసుల కాపలాగ వుంచి

శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరధి
సీతా సీతా సీతా సీతా అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా
రోధించే సీతాపతి

రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం
కమలనయనములు మునిగే పొంగేకన్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో

వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి
సీత సిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చి

వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
వానరవేగముగ రామభద్రుడె రావణ తలపడికొట్టెర
భుజమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెగా
అంత బాధ పడి సీతకోసమని ఇంత చేసె శ్రీరాముడు
చెంతచేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
వయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీపరిక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ

అగ్గిలోకి దూకే అవమానముతో సతి అగ్గిలోకి దూకే అవమానముతో సతి
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహొత్రుడే పలికే దిక్కులు మార్మోగగా
సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె నేటి శ్రీరాముడు
ఆ జానకితో అరణ్యమేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *