Bapps

శ్రీరామ లేరా ఓ రామా

శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమా
మదిలో అసురాళిని మాపగరా
మద మత్సర క్రోధములే మానుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా
శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగరా
ఆ ఆ ఆ ఆ ఆ
దర్శనమునుకోర దరికే చేరే దయగల మా రాజు దాశరధి
తొలుతనె ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియ వాది
ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహపరమై మేలు ఒసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగుడుదులే
మా శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగరా
సీతారామ చూపే నీ మహిమ ఆ ఆ ఆ

తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడ మధురం
సమయం అంతా సఫలం
ఇది రామ ప్రేమలోకం ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం ఆ ఆ
శ్రీరామ రామ రఘు రామ
పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతాభామ ప్రేమారాధనమా
హరికే హరిచందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ ఊ ఊ ఊ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *