ఏమని పాడెదనో ఈ వేళా
ఏమని పాడెదనో ఈ వేళా
మానస వీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో
జగమే మరచి హృదయ విపంచి (2)
గారడిగా వినువీధి చరించీ (2)
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళా
యేమని పాడెదనో ||
=వనసీమలలో హాయిగా ఆడే (2)
రాచిలుక నిను రాణిని చేసే (2)
పసిడి తీగలా పంజరమిదిగో
పలుకవేమనీ పిలిచేవేళా