పల్లవి :
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై
॥
చరణం : 1
సరదా సరదాలెన్నో అందించావే
సమయం గురుతే రాని సావాసంతో
విరహం చెరలో నన్నే బంధించావే
ఎపుడూ మరుపేరాని నీ అందంతో
ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించావే
రెప్పల్లోన తుళ్లే చూపుల్తో
ఆరాటం ఊరించావే మోమాటం వారించావే
చేరువలోన చేసే దూరంతో చెలియా… ఆ…
॥
చరణం : 2
అసలే వయసే నన్ను తరిమేస్తుంటే
అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే
అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే
సరిగా నమ్మించే బదులేం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు
ఎన్నాళ్లింక కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు
ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా… ఆ…
॥