పల్లవి :
ఓ వెన్నెల… తెలిసేదెలా నే…
ఓ నేస్తమా… నిలిచేదెలా నే…
కళ్లు కళ్లు కలిశాయంటా
వలపే పూవై పూచిందంటా
నమ్మినవారే పువ్వుని కోస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్లా ॥కళ్లు॥
ఓ వెన్నెల కలిపేదెలా…
చరణం : 1
జడివాన నింగినీ తడి చేయునా?
గంధాలు పూవుని విడిపోవునా?
న న్నడిగి ప్రేమా ఎదచేరెనా
వలదన్న ఎదనూ విడిపోవునా
మరిచాను అన్న మరిచేదెలా
మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెల కలిపేదెలా నే…
చరణం : 2
వలపించు హృదయం ఒకటే కదా
ఎడమైతే బ్రతకూ బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే
కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమా చనిపోదులే
ఏనాటికైనా నిను చేరులే
॥వెన్నెల॥