జారిపోయెనా నీ చేయి జారెనా
తెలుగురాని కొత్తతరంలా
నీరు లేని తెలుగుజనంలా
యువతిలేని యువకునిలాగా
దయమరచిన దైవంలాగా
శౌర్యంలేని ఖడ్గంలాగా
నీరుడిగిన నేలతల్లిలా
తూర్పెరగని సూర్యుడిలాగా
హద్దుచెరిగి దేశంలాగా
తెల్లని ఇసకను మథనం చేస్తే మనసే పుడుతుందా
పై పై వేషం లోపల పాశం కథ నడిపిస్తుందా
నిను పోగొట్టుకుని నిన్నే వెతికేవా
మదిలో ఆశలతో పెదవికి తాళాలా
అరే యెంత పిచ్చిదానివే