Bapps

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాల
కన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల
ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

మన అసలు పేరు నీడా అడుగడుగు తోడుగా
కధ నడుపు తమరి జాడా కనపడదు వేడుకా
కరి మబ్బు చాటు తార కనిపించెనా సితార
చిరు చీకటింటి నీడ వెలిగింది కంటి నిండా
విరహాల ఆలయాన విరజాజి హారతేలా
ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం
చిరు కనుల ఎరుపులే వలపు గెలుపులై తెలుపనా
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

ఉసిగొలుపు ఉడుకు తనమా చలి పొగరు చాలు లే
కుదురైన కలికితనమా కసి కధలు చెప్పకే
యదకెదుగు చిలిపి తనమా సొద పెట్టి చంపుతావా
పొదలడుగు వలపు తనమా పెదవుల్లో దాచుతావా
నిదురమ్మ పలకరింతా నివురొయె అలచినంతా
హృదయాల సీమ లోనా యద గాన కోకిలేనా
మన ఏడు జన్మలే ఏడు రంగులై కలిసెనా
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాల
కన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల
ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *