Bapps

ఇది తొలి రాత్రి కదలని రాత్రి

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నెలమ్మ దీపాన్ని అర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపాన్ని అర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమేమో మత్తుగా తిర్గుచున్నది
దీపమేమో విరగబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు నీ పిలిపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నెలంత అడవిపాలు కానన్నది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
వెన్నెలంత అడవిపాలు కానన్నది మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
ఆనురాగం గాలిలో దీపమైనది మమకారం మనసునే కాల్చుకున్నది
నీ చివరి పిలుపు కొరకు ఈ చావు రాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపొతున్నది

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే

Leave a comment

Your email address will not be published. Required fields are marked *