ఎదురయే every లైలా మృదువుగా నవ్వితే చాలా
మెదడలా నివ్వెర పోవాలా
ఎదలయే కెవ్వుమనేలా మొదలయే యవ్వనలీలా
నిదురలో నిప్పులు పొయ్యాలా
బహుబాగుందిరా బాలా కాసేపటు చూసాం కదరా
ఇహ చాలనుకోవాలా మతి చెడితే మజునూలవరా
ఊరికె మనసునంతగా ఉరకనీకురా అటుఇటుగా
ఉహాలో మునిగిపోతే మరి పైకి తేలవురా అయ్యయ్యయ్యయ్యయ్యో ||ఎదురయే||
అంతులేని ఆశ అంతలో నిరాశ నిముషమొక్క చోట నిలవనీదురా
ఎందుకో హమేషా వయసుకీ ప్రయాసా మాయలేడి వేట మానుకోదురా
ప్రతి పిల్లగాలి తన్నెల్లకాలము వదిలిపోక నిలిచేనా
ఏ గుండెగూడు ఏ గువ్వ సొంతమో ముందుగానే తెలిసేనా ||ఊరికె మనసునంతగా || ||ఎదురయే||
కొలిమిలాగా మండే కలత రేపుతుంటే దాన్ని చెలిమి అంటే తప్పు సోదరా
వంద ఏళ్ళు వుండే జన్మ బంధమంటే పంతమాడి పొందే గెలుపు కాదురా
ప్రేమిస్తునాననే తలపు నీకు ఇవ్వాలి నిత్య సంతోషం
ఇచ్చేదే గాని దోచేది కాదురా స్వచ్చమైన సావాసం ||ఊరికె మనసునంతగా || ||ఎదురయే||