ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా
చండతర దండథర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
నియముండా హ యముండా
అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీఆఆ
ఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్ఆఆ
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం
ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
నరలోకమున ఊరికొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమ హాయి నీదేలే రసికావతంస
రసికాగ్రేసరుండా యముండా
మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రా దేవరా
మజ్జారే మదవతీ ||సెహబాసులే|| ||ధర్మపరిరక్షణ||