ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ||ఒక||
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే ఆమినిలా
ఎన్నో జన్మల్లోన పున్నమిలా
శ్రీరస్తంటూ నీతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని ||ఒక||
విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనా
నీ నీడే చూసాడమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనా
నీ జాడే వెదికాడమ్మ
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం
నీలోనే వుందమ్మ అందని స్వర్గం
రవళించే హృదయంతో రాగం తీసి
నీ కుంకుమ తిలకంతో కవితే రాసి
అంటుందమ్మా తన మనసే నిన్నే ప్రేమిస్తానని ||ఒక||
కళ్ళకు కలలే రెండు కాటుక సుగ్గులు చిందు
కాబోయే కళ్యాణంలో
తనలో సగమే వీది నీలో సర్వం తనది
అనురాగం మి ఇద్దరిది
ఆ తారా తోరణమే మల్లెల హారం
చేరాలి మురిపాల సాగర తీరం
అలరించే మీ జంట వలపుల పంట
శుభమంటూ దీవించే గుడిలోగంట
చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని ||ఒక||