ఏల్లొ ఏలొ ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరోయ్
రేల్లొ రేల్లో రేలో రేలొ రేల్లొ రేల్లొరా
కొంగుకొంచెం భద్రం పిల్లో కొంపముంచేటట్టుండే
పొంగుకొచ్చే సింగారంలో సంగతేమయ్యుంటుందే
నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే
దూకుతుంటే నేనేం చేసేదే
మాటువేసి లాగేసే మాయలోపడి నా మనసే
మాట విన్నని మారం చేస్తోందే ||ఏల్లో||
కళ్ళు చెదిరే ఎన్నందాలో తుళ్ళుపడరా కుర్రాళ్ళు ||ఏల్లో||
గుండెలదిరే ఆనందంలో వెంటపడరా వెర్రోళ్ళు ||రెళ్ళో||
నీడపట్టున ఇన్నాళ్ళు కూడపెట్టిన అందాలు
దాచుకుంటే భారంగా ఉందే
వెచ్చచెచ్చని ఆవిరితో వచ్చి తగిలే చూపుల్లో
వేడికూడా వేడుకగా ఉందే ||ఏల్లో||
ఎప్పుడిట్టా విచ్చేసిందే వంటిమీదకి పెళ్ళీడు
ఎందుకిట్టా వీధికెక్కిందే ఎండతగలని నీ ఈడు
కాలదోషం వదిలిందో మీనమేషం కుదిరిందో
జంట చేరే దారే తెలిసిందో
పచ్చజెండా ఊగిందో పడుచుప్రాయం తూగిందో
పల్లకీ పదమంటూ పిలిచిందో ||ఏల్లో||