Bapps

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగె

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగె
దూరినట్టుంది కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది
సరెసరె రా మరి హుటాహుటి ఇంతలో ఇదేమిటి ఆగలే
నంటు పైటె గోలపెట్టింద ఆదుకొమ్మంటు నాకే కన్నుకొట్టింది
ఆపసోపాలు పడలేను కాని కాస్త కరుణించు నారాయణ
రాహుకాలాన్ని రావద్దు అంటు రాత్రి తెల్లార్లు పారాయణ
వస్తాడు నువ్వేలారా ఎవ్వరేమన్నాడు
ముస్తాబు వచ్చేసింది ఏ సుగుణ ||శ్రీహరి సరాసరి||
ఆవురవురు అంటునే ఆశ పడుతున్న
ఆ సంగతి ఈ రోజె ఆలకిస్తున్నా
వయసు మాగాణి నికిచ్చుకుంటూ రైతువై పంట పండించుకో
పదును చూడందె నేవదులుతానా అప్పగించేసి నువ్వురుకో
వయ్యారితో ఇవ్వాళిలా
కయ్యానికే కాలు దువ్వాలటా ||శ్రీహరి సరాసరి||
ముట్ట గట్టిన బంగారం ముందరెడుతున్నా
నీ వంపుల(Temple) టెంపుల్‌ లో పూజకొస్తున్నా
కూత పెడుతోంది పరువుల కోడి మూతపెట్టేసి ముద్దాడుకో
రెచ్చగొట్టాక నేనాగుతాన పుంజునవుతాను పూలకించిపో
ఏకాకీ ముఖాముఖి షికారుకే సిద్ధమవ్వలట ||శ్రీహరి సరాసరి||

Leave a comment

Your email address will not be published. Required fields are marked *