పల్లవి : మాయదారి సిన్నోడు
మనసే లాగేసిండు
నా మనసే లాగేసిండు
లగ్గమెప్పుడురా మాఁవా అంటే
మాఘమాసం ఎల్లేదాకా
మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా (2)
కాఁవమ్మ సెప్పవే రాఁవమ్మ సెప్పవే
రత్తమ్మ సెప్పవే అత్తమ్మ సెప్పవే ॥॥
చరణం : 1
సింతసెట్టెక్కి సిగురులు కోస్తుంటే
సిట్టి సిట్టి గాజులూ తాళం ఏస్తుంటే ॥
సిగురుల్లో సిగురుల్లో
సిగురుల్లో మాటేసి కన్నుగీటిండే
జివ్వున పానాలు తోడేసిండే
ఎప్పుడ్రా మాఁవా అంటే
సంకురాతిరి పొయ్యేదాకా
మంచిగడియే లేదన్నాడే ॥
ఎల్లమ్మ సెప్పవే మల్లమ్మ సెప్పవే
పుల్లమ్మ సెప్పవే బుల్లెమ్మ సెప్పవే ఆగే
చరణం : 2
ఊరి సెరువులో నేనీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే ॥
బుడుంగున బుడుంగున
బుడుంగున మీదికి తేలిండే
నా తడికొంగు పట్టుకుని లాగిండే
ఎప్పుడురా మాఁవా అంటే
శివరాతిరి ఎల్లేదాకా
సుబలగ్గం లేదన్నాడే ॥
పున్నమ్మ సెప్పవే గున్నమ్మ సెప్పవే
కన్నమ్మ సెప్పవే సిన్నమ్మ సెప్పవేఆగే
చరణం : 3 కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా
డొంకదారినొస్తుంటే ॥
గబుక్కున గుబుక్కున
గబుక్కున కళ్లు రెండు మూసిండే
రివ్వున వాటేసి నవ్వేసిండే
ఏందిరా మాఁవా అంటే
కోడికూసి కూయంగానే
తాళి కడతానన్నాడే
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
అమ్మమ్మ సెప్పవే అయ్యమ్మ సెప్పవే
పెద్దమ్మ సెప్పవే పిన్నమ్మ సెప్పవే ॥॥