Bapps

అంద చందాల సొగసరివాడు

పల్లవి :
అంద చందాల సొగసరివాడు (2)
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ… ఓహో చందమామ
చందమామ ఓహో
చందమామ ఓ ఓ ఓ…

చరణం : 1
ఓ ఓ ఓ… చూడచూడంగ
మనసగువాడు
ఈడు జోడైన వలపుల రేడు
ఊఁ… వాడు నీకన్నా సోకైన వాడు
విందు భోంచేయి వస్తాడు నేడు

చరణం : 2
ఓ ఓ ఓ… వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
ఊఁ… వాడు నీకన్నా చల్లని వాడు
విందు భోంచేయి వస్తాడు నేడు

చరణం : 3
ఓ ఓ ఓ.. నేటి పోటీల గడుసరివాడు
మాట పాటించు మగసిరివాడు
ఊఁ… వాడు నీకన్నా సిరిగిలవాడు
విందు భోంచేయి వస్తాడు నేడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *