అహొ ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ
ఈ శిధిలాలలో చిరంజీవివయనావయ్య
శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
చరణం1:
కనుచూపు కరువైనవారికైన కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు
ఒక పక్క ఉరికించు యుద్ధభేరీలు
ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలికించు నగరానికొచ్చము
కనులులేవని నీవు కలతపడవలదు
నా కనులు నీవిగా చేసుకొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
చరణం2:
ఏకశిలరధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగ
ఏకశిలరధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగ
రాతిస్తంభాలకే చేతనత్వముకలిగి సరిగమపదనిస స్వరములే పాడగా
కొంగుముడి వేసుకొని కొత్తదంపతులు కొడుకుపుట్టాలని కోరుకున్నారని
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
చరణం3:
రాజులే పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు మారినా గాల్పులే వీచినా
మనుషులే ధనుజులై మట్టిపాల్జేసినా
ఆ ఆ ఆ ఆ చెదరని కదలని శిల్పాలవలేనే
నీవునా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలి
నిజము నా జాబిలి