హే… నింగి జారిపడ్డ చందమామ ముక్కా
లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా
చాల్లే చిందులాట కోతి పిల్లలా…
హే… అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా
హే… చిన్న పల్లెటూరి బావిలోన కప్పా
నీలోన ఏమిటంట అంతలేసి గొప్పా
నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా
హే… నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా…
మీసమున్న కుర్రవాణ్ణిలే…
మీదికొస్తే ఊరుకోనులే… కొండతోటి పందెమేయకే..
నొప్పులు గొప్పులు తప్పవే మరీ…
హే… పంతం మానుకోవే పాలకోవా…
పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా…