కళ్యాణిని కళ్యాణిని
కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని
మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని
నీ ఆశల కుంచెలతో అనురాగాల రంగులతో
ఊహించుకో నను చిత్రించుకో ఎదలోన పదిలంగా నను దాచుకో కళ్యాణిని
చందమామ మోము ఆఆ
చారడేసి కళ్ళు ఆఆ
దొండపండు పెదవి పండు నిమ్మ పసిమి ఆఆ
కడలి అలల కురులు కానరాని నడుము
కన్నె సొగసులని కవులన్నారు అవి అన్నో కొన్నో ఉన్నదానను కళ్యాణిని
చందమామ మోము చారడేసి కళ్ళు ఉహూ దొండపండు పెదవి పండు నిమ్మ పసిమి
చల్లదనం పేరే ఆ ఆ చందమామ కాదా
చారడేసి కళ్ళే ఆ ఆ శాంతి ఝల్లు కాదా
పిలుపులోని వలపే పెదవి ఎరుపు కాదా
కనుగొన్నాను శిలగాని శిల్పాన్ని కవులైన కనరాని కళ్యాణిని కళ్యాణిని