కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
మేలిమిబంగరు చీరలో మెరిసే ఓ వయారి
నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి
శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి
కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామరమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం
హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం
ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా ఆ ఆ ఆ ఆ
అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం
ఏయ్ ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం
నిలిచా నినుకోరి, రసమయ రహదారి
శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి
మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై ఆ ఆ ఆ