Bapps

వెలిగినదొక వానవిల్లు

వెలిగినదొక వానవిల్లు
నిను తలవంచి చూసెనే
ఎదలోపల వానలే ఇలా గుచ్చే సరం
నువ్వు నన్ను చూడగ
నన్ను చూడగా ఏమయినదో ప్రేమ
నువ్వు నన్ను తాకగా
నన్ను తాకగ ఏమవుతదో ఏమో
తొలి తొలి గా వయసదిరే
కొన్నాల్లు ఊసు రాదులె
నిన్నే స్మరించినానులే
కలా నిజం ఇంకా

వెలిగినదొక వానవిల్లు
నిను తల వంచి చూసెనే
ఎదలోపల వానలే ఇల గుచ్చే సరం

నీ వస్తేనే నా జన్మలో
పూ పూసేనా చూపులో
నేడెలా నీ ఆగతం
నా జ్ఙాపకం అయ్యిందెలా
వేచుంది పున్నాగలాంటి కన్నే కదా
ఎవ్వడు ఎవ్వడు ఓ మాయడు నన్నాపడు ఇంతే
ఎవ్వడు ఎవ్వడు నన్నెందుకో లాగేస్తడు అంతే
ఇది తెలుసా ఒక విధమౌ
మత్తేదో చల్లినాడుగా మొత్తంగా మార్చినాడుగా
మరో జగం ఇదే

వెలిగినదొక వానవిల్లు
నిను తల వంచి చూసెనే
ఎదలోపల వానలే ఇలా గుచ్చే సరం

నీ ముందుండి సాగితే ఎవరో వెనుకుంది తోసెనో
మౌనమై నేనుండగా గానమై ఎవరూగెనో
నీవున్న క్షణములో గాలి ఈలేసెనో ఓ
అంతే ఓ తొందరై నా ఊహలే చిందేసెనే ఏంటో
వింతల్లే ఎందుకో నా ఆశలై అల్లేసెనే ఎంతో
మెల్ల మెల్లగా సగమవనా
వర్ణాలు నన్ను ముంచెనో వందేళ్ళ వైనం చూపెనో
నిరంతరం ఇలా

తర నన న న నా న నా
తర న న నా న నా
తర నన నా న నా
న నా న నా న నా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *