Bapps

ఎవడున్నాడీలోకంలో ఇదివరికెరుగనివాడు

ఒకరోజు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను

ఎవడున్నాడీలోకంలో ఇదివరికెరుగనివాడు
ఎవడున్నాడీకాలంలో సరియగునడబడివాడు
నిత్యము సత్యము పలికే వాడు
నిరతము ధర్మము నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యుని వలెనే వెలిగెడి వాడు
ఎల్లరికి చల చల్లని వాడు
ఎదనిండా దయదల వాడు
ఎవడు ఎవడు ఎవడు

అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు

ఒకడున్నాడీలోకంలో ఓంకారానికి సరిజోడు
ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
నిలువలు కలిగిన విలుకాడు
పలు సుగుణాలకు చెలికాడు
చెరగని నగువుల నెలరేడు
మాటకు నిలబడు ఇలరేడు
దశరధ తనయుడు దానవ దమముడు జానకి రామణుడు అతడే
శ్రీరాముడు శ్రీరాముడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *