గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు
ఘోరం ఆపేదెవరు ఎవరూ ఎవరూ
రారె మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
సాగె ఈ మౌనం సరేనా
కొండ కోన అడవి సెలయేరు సరయూ నది
అడగండి న్యాయం ఇదేనా
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ
ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం
ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరార
అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం
రాముని కోరగ పొలేద ఈ రధముని ఆపగలేదా
విధినైన కాని ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ
అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే
రక్కసివిధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా
సుగుణంతో సుర్యుని వంశం వెలిగించే కులసతిని
ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైన కాని
నీమాటేనీదా వేరే దారేది లేద
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు
ఘోరం ఆపెదెవరు ఎవరూ ఎవరూ
రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
అడగండి న్యాయం ఇదేనా
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ