మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు
పడనీకే మాపున మును మాపునా
నిను మరల పిలుస్తా పోబోకే
మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు పడనీకే
మాపున మును మాపునా నిను మరల పిలుస్తా పోబోకే
బంకింగ్ హం కాలువలో నీరేగా మా గంగ
అందంగా బట్టలు ఉతికేటోల్లం
అరె ఓయా తప్పు కోయా పొద్దు వాలే ముందే పనినే చేద్దాం రాయా
మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు పడనీకే
మాపున మును మాపునా నిను మరల పిలుస్తా పోబోకే
సూర్యుడి వెలుగులతోనే బట్టకి నిగ నిగ పెడతాం
చిట పట చినుకులు వస్తే మేము జూదమాట మొదలెడతాం
ర ర ర ఒక తాయం ఆరు ర ర ర ఒకే ఒక్క తాయం రెండు ఆర్లు
ర ర ర ఒకే ఒక్క చుక్క యెహ నువ్వెయ్యరా
ఓ కంచర గాడిద మీద గంపెడు మూటలు పెట్టి
ఆపై నింగిని నమ్మి ఇక మా జీవయాత్ర సాగిస్తాం
చాకలోడి బ్రతుకు కూడా దేవుడు తీరేలే
ఊరి వాళ్ళ పాపపు మూటలు మోస్తాం
ఒల్లంతా రొచ్చైనా ఏకంతో స్వచ్చంగా
ఆకాశంలాగే మనసే తెలుపు
అరె ఓయా తప్పు కోయా పొద్దు వాలే ముందే పనినే చేద్దాం రాయా నువ్వు రాయ్యా
చేతిలో కాసులు లేవు మనసులో కపటం లేదు
మోసపు బతుకులు కావు అందుకే చీకు చింతలు రావు
హెల్లో సార్ దొర నీషక్తికి సిరా
ఇటొస్తే సరా మాదెబ్బతో హరా
బల్లో చెప్పే పాటం మాకేమీ తెలియదులే
అనుభవ పాటం చదివాం అందుకే ఓటమన్నదే ఎరుగం
ఒక ముక్కానీ ముక్కానీ ఒక ముక్కానీ ముక్కానీ
రెండు ముక్కానీ అనన్నరా రెండు ముక్కాలు అనన్నరా
మూడు పావలాలు ముప్పావలా మూడు పావలాలు ముప్పావలా
నాలుగు రూపాయిగా నాలుగు రూపాయిగా
తుండు వేసినా గుండుకుమల్లే తొలగని పేదరికం
బండకేసీ బాదుతుంటే బయమేదీ
తలవాలీ పోతున్నా మన బరువే పోరాదు
తల వంచని వీరుడిలా జీవిస్తా
అరె పోయా తప్పు కోయా పొద్దు వాలే ముందే పనినే చేద్దాం రాయా రాయ్యా ఆ ఆ ఆ
మేఘమా ఓ మేఘమా నీ జల్లున హాయిగా తడిసేము
మాపున మును మాపునా మా మనసును నీకు ఇచ్చేము