Bapps

బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది

హేయ్ బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది
ఆహా బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటురాయి అబ్బా
చురుక్కు చురుక్కు మంటొంది పగలు రేయి
చురుక్కు చురుక్కు మంటొంది పగలు రేయి

కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడు
కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడు
కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడు
ఆ చేతిలో ఏముందో ఆకురాయి
అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది పగలు రేయీ
చురుక్కు చురుక్కు మంటోంది పగలు రేయీ

మరుమల్లె తీగలాగ నిలువెల్లా చుట్టేస్తుంది
అణువణువు నాలో నిండీ మనసంతా పండిస్తుందీ
మనసులో ఏముందో అంత గారం నన్ను
కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం ఓ
కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం

వద్దన్న ఊరుకోడు కలలోకి వచ్చేస్తాడు
మొగ్గలంటి బుగ్గలమీద ముగ్గులేసి పోతుంటాడు
ముచ్చటలో ఏముందో చెప్పలేను అబ్భా
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ

అహా బుంగమూతి బుల్లెమ్మా దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి
అబ్భా చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ అహా
చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ

చుక్కల్లో చక్కదనం వెన్నెల్లో చల్లదనం
అడుగడుగున అందిస్తుందీ చిరునవ్వులు చిలికిస్తుందీ
నవ్వుల్లో ఏముందో ఇంద్రధనుస్సు అబ్భా
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ

ఉడికించే రాతిరిలో ఊరించే సందడిలో
బాసలనే పానుపు చేసి ఆశలనే కానుకచేసి
స్వర్గాలు చూడాలి ఆ మనసులో నేను
ఇరుక్కు ఇరుక్కు పోవాలి ఆ గుండెలో

కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏసాడు
ఆ చేతిలో ఏముందో ఆకురాయి అబ్బా అబ్బా
చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ
చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *