Bapps

నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట

నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట ఎందుకంటా
యుగ యుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడు లేదంటా అలాగా

నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట ఎందుకంటా
యుగ యుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడు లేదంట
నీకు నాకు పెళ్ళంట
నింగి నేలకు కుళ్ళంట నదికీ కడలికి పొంగంట

ప్రతి రేయి మనకొక తొలి రేయంట ఆ
తొలి ముద్దు పెదవులు విడిపోవంట ఆ
జగతి కంతటికి మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
ఆ నా కంట నిను చూసుకుంటా
ఆ నీ చూపు నా రేపు పంట ఆ ఆ
నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట

మన కోర్కెలన్నీ పసిపాపలంట ఆ ఆ
చిగురాకు మనసుల చిరునవ్వులంట ఆ ఆ
వయసు లేనిది మన వలపేనంట
మన జీవితం ఆటాపాటేనంట
ఆ నాలోన నిను దాచుకుంటా
ఆ నీ ఊపిరై కాచుకుంట ఆ ఆ
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
యుగ యుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడు లేదంట
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *